బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్ననే ఉమ్మడి హైకోర్టును [more]

Update: 2018-12-27 11:52 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్ననే ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ జనవరి 1వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు విడివిడిగా పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి నేడు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టును మరికొంత కాలం ఇక్కడే కొనసాగించాలని ఏపీ న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో సరైన వసతులు లేనందున ఇక్కడి నుంచే హైకోర్టు నడిచేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు ఆందోళన చేస్తున్న సమయంలోనే రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ నియామకపు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. తెలంగాణకు పది మంది, ఆంధ్రప్రదేశ్ కు 16 మంది న్యాయమూర్తులను ఇప్పటికే నియమించారు.

సీనియారిటీతోనే…..

1961లో ప్రవీణ్ కుమార్ జన్మించారు. హైదరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ఆయన విద్యనభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివిన ప్రవీణ్ కుమార్ గత కొంత కాలంగా ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్నారు. 2013 నుంచి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఆయనకున్న సీనియారిటీతోనే ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. క్రిమినల్ లాయర్ గా ప్రవీణ్ కుమార్ కు మంచి పేరుంది.

Tags:    

Similar News