పార్క్ హయత్ కేసులో జరిగిందిదేనా?

పార్క్ హయత్ పార్టీ కేసు లో అసలేం జరిగింది. మంత్రి అల్లుడు పాత్ర ఎంత వరకు ఉంది? పబ్ యజమాని నాలుగు నెలల నుంచి గదిలో ఏం [more]

Update: 2020-07-06 12:53 GMT

పార్క్ హయత్ పార్టీ కేసు లో అసలేం జరిగింది. మంత్రి అల్లుడు పాత్ర ఎంత వరకు ఉంది? పబ్ యజమాని నాలుగు నెలల నుంచి గదిలో ఏం చేస్తున్నాడు . ఉక్రెయిన్ చెందిన మహిళ 4 నెలల నుంచి హైదరాబాద్ లో ఎందుకు మకాం వేసింది? వీటన్నింటినీ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. గత నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్ మహిళ పేరు మీద పార్క్ గదిని బుక్ చేయడం జరిగింది. అప్పటి నుంచి యజమాని సంతోష్ రెడ్డి ఇక్కడ నిత్యం పార్టీలు చేసుకుంటున్నట్లుగా తేలింది. ఇక్కడికి తన కస్టమర్ ను తీసుకు వచ్చి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలోనే ఇప్పుడు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఆ గదిలోనే అన్నీ….

గోవాలో పబ్ లకు మేనేజర్ గా ఉక్రెయిన్ వ్యవహరిస్తున్నారు. దీంతోపాటుగా హైదరాబాద్ చెందిన పబ్బు యజమాని సంతోష్ రెడ్డికి కూడా ఈ మహిళ మేనేజర్ గా పని చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి పార్క్ హయత్ లోని రూమ్ నెంబర్ 721 గదిని బుక్ చేస్తున్నారు. సంతోష్ రెడ్డి జూబ్లీహిల్స్లో ఒక పబ్ ను నిర్వహిస్తున్నాడు. డాట్ పబ్ పేరుతో సంతోష్ రెడ్డి దీనిని నడుపుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ పబ్ లో అసాంఘిక కార్యక్రమాలు వెలుగులోకి రావడంతో సంతోష్ రెడ్డి అరెస్ట్ చేశారు. 32 మంది అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పార్క్ హయత్ పార్టీ లో మంత్రి సమీప బంధువైన రఘువీర్ రెడ్డి, కేశవరావు ,భానుకిరణ్ తో పాటు కొంతమంది మహిళలు పార్టీ కి పిలిచాడు . వీళ్లందరి తో కలిపి పార్క్ హయత్ లోని రూమ్ నెంబర్ 721 పార్టీ నిర్వహించారు. విషయాన్ని హోటల్ ప్రతినిధులు పోలీసులకు చేరవేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని నలుగురు అమ్మాయిలతో పాటు నలుగురు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళతో కలిసి ఉన్న మొత్తం నలుగురు మహిళల లింకు పైన ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు . ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Tags:    

Similar News