మున్సిపల్ ఎన్నికలపై తీర్పు రిజర్వ్

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలంటూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని, నామినేషన్లు కొందరు వేయలేకపోయారని పిటీషనర్ల తరుపున న్యాయవాదులు వాదించారు. అధికార [more]

Update: 2021-02-24 01:52 GMT

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలంటూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని, నామినేషన్లు కొందరు వేయలేకపోయారని పిటీషనర్ల తరుపున న్యాయవాదులు వాదించారు. అధికార పార్టీ బెదిరింపులతో నామినేషన్ వేయలేకపోయారన్నారు. ఆగిన చోటు నుంచి ప్రారంభించే అధికారం ఎస్ఈసీకి ఉన్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని వారు వాదించారు. కొత్తగా నామినేషన్లకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే ఎస్ఈసీ తరుపున న్యాయవాదులు మాత్రం నామినేషన్లు వేయలేకపోయిన వారికి తగిన ఆధారాలు చూపి వేసుకునేందుకు అనుమతిచ్చినట్లు పేర్కొన్నారు. ఇరువర్గాల వాదన విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Tags:    

Similar News