ఎల్వీ బదిలీపై పవన్ రెస్పాన్స్

151 ఎమ్మెల్యే సీట్లు సాధించిన ఐదు నెలల్లోనే జగన్ ప్రభుత్వంపై ఇంతటి వ్యతిరేకత రావడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో [more]

Update: 2019-11-04 12:04 GMT

151 ఎమ్మెల్యే సీట్లు సాధించిన ఐదు నెలల్లోనే జగన్ ప్రభుత్వంపై ఇంతటి వ్యతిరేకత రావడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను, అక్రమాలను సరిచేయాలి కాని, మొత్తానికి ఆపేస్తే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందన్నారు. విశాఖ లాంగ్ మార్చ్ కు ఇంతమంది హాజరవుతారని తాను ఊహించలేదన్నారు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదన్నారు. ప్రజాసమస్యను ప్రభుత్వ దృష్టికి తెచ్చానన్నారు. పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ నాయకులపై తనకు వ్యక్తిగత వైరమేదీ లేదన్నారు. ప్రభుత్వ విధానంలో తప్పులుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. ఇసుక కొరతపై వారంరోజుల సమయం ఇచ్చామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కోరితెచ్చుకున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు బదిలీ చేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

Tags:    

Similar News