Pattabhi : విజయవాడకు పట్టాభి.. మరికాసేపట్లో ?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడకు తరలించారు. అత్యంత భద్రత మధ్య పట్టాభిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. [more]

Update: 2021-10-21 06:14 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడకు తరలించారు. అత్యంత భద్రత మధ్య పట్టాభిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ లో రాత్రి నుంచి పట్టాభి ఉన్నారు. ఆయనను పోలీసులు విచారణ చేశారు.

టీడీపీ ఆందోళన…

టీడీపీ శ్రేణులు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగారు. పట్టాభిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆందోళనకు అనుమతిచ్చారు. పట్టాభిని విజయవాడకు తీసుకెళ్లడంతో అక్కడి నుంచి టీడీపీ నేతలు విజయవాడకు బయలుదేరారు.

Tags:    

Similar News