Pattabhi : పట్టాభి వ్యాఖ్యల వివాదం… ఉద్రిక్తత..టీడీపీ ఆఫీస్ ముట్టడి

టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలపై కాకినాడ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ పోర్టులో హెరాయిన్ ఉన్న పడవ అగ్ని ప్రమాదానికి గురైందని, అందులో పెద్దయెత్తున హెరాయిన్ [more]

Update: 2021-10-06 13:15 GMT

టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలపై కాకినాడ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ పోర్టులో హెరాయిన్ ఉన్న పడవ అగ్ని ప్రమాదానికి గురైందని, అందులో పెద్దయెత్తున హెరాయిన్ ను స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు సప్లయ్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకే పడవ ప్రమాదం జరిగితే తెల్ల పొగలు వచ్చాయని కూడా పట్టాభి విశ్లేషించారు. దీంతో కాకినాడ టీడీపీ కార్యాలయాన్ని మత్స్యకారులు ముట్టడించారు. తమ పడవల్లో హెరాయిన్ ను సప్లయ్ చేసినట్లు చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. తాను మత్స్యకారులను ఏమీ అనలేదని, ఒకవేళ అలా అని ఉంటే ఉపసంహరించుకుంటానని పట్టాభి తెలిపారు.

Tags:    

Similar News