తెలంగాణలో ఆగని కరోనా… రోజురోజుకూ పెరుగుతున్న?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

Update: 2020-06-09 01:51 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్కరోజే 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు. దీంతో కరోనాతో తెలంగాణలో మృతి చెందిన వారి సంఖ్య 139కి చేరింది. వలస కార్మికులు కూడా ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సమీక్ష నిర్వహించారు. కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో మరింతగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

Tags:    

Similar News