గడ్కరీ ‘‘హంగ్’’ కోరుకుంటున్నారా?

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హంగ్ రావాలని కోరుకుంటున్నారని శివసేన వ్యాఖ్యానించింది. శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ [more]

Update: 2019-01-07 10:18 GMT

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హంగ్ రావాలని కోరుకుంటున్నారని శివసేన వ్యాఖ్యానించింది. శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ సామ్నా పత్రికకు రాసిన ఒక కథనంలో ఈ విషయం పేర్కొన్నారు. హంగ్ ఏర్పడితే తనకే ప్రధాని అయ్యే ఛాన్సు ఉంటుందని గడ్కరీ భావిస్తున్నారు. అనేక మంది బీజేపీ నేతలు మోదీ, షాల నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని రౌత్ పేర్కొన్నరు. కొన్ని ప్రత్యేక కారణాల వల్లనే గడ్కరీ రెండోసారి బీజేపీ అధ్యక్షుడు కాలేకపోయారన్నారు. నరేంద్ర మోదీరోజురోజుకు ప్రాబల్యాన్ని కోల్పోతున్నారని, కాంగ్రెస్ అధ్యక్షుడురాహుల్ గాంధీ మెరిసిపోతున్నారంటూ రౌత్ తన కథనంలో పేర్కొనడం విశేషం. 2014లో మోదీ గాలి దేశవ్యాప్తంగా బలంగా వీచిందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు సంజయ్ రౌత్.

Tags:    

Similar News