ఆ ప్యాకేజీలు.. ఐదు బడ్జెట్ లతో సమానం

కరోనా సమయంలో ప్రభుత్వం ప్రకటంచిన ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్ లతో సమానమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2021 కేంద్ర బడ్జెట్ ను [more]

Update: 2021-02-01 06:03 GMT

కరోనా సమయంలో ప్రభుత్వం ప్రకటంచిన ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్ లతో సమానమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2021 కేంద్ర బడ్జెట్ ను నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినిందన్నారు. లాక్ డౌన్ వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. అయినా అన్నింటిని అధిగమించగలిగామని నిర్మలా సీతారామన్ చెప్పారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. మరో రెండు వ్యాక్సిన్ లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి అవసరమైన వన్నీ ఈ బడ్జెట్ లో పొందుపర్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు లాక్ డౌన్ కష్టాలు కొంత వరకూ తీర్చగలిగాయని చెప్పారు.

సుస్థిరత కోసమే….

కరోనాపై ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈదేశం మూలాల్లోనే ఆత్మనిర్భరం ఉందన్నారు. కరోనా తర్వాత కూడా ఇప్పు కొత్త ప్రపంచంలో ఉన్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. సుస్థిరత కోసమే ఆత్మనిర్భర్ ప్యాకేజీని తీసుకొచ్చామని తెలిపారు. లాక్ డౌన్ విధించకపోతే భారీ నష్టాన్ని భారత్ చవిచూడాల్సి వచ్చేదన్నారు. పీఎం గరీబ్ యోజన పథకం లాక్ డౌన్ సమయంలో పేదలకు ఉపయోగపడిందని తెలిపారు. 64,180 కోట్లతో పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకాన్ని నిర్మల ప్రకటించారు. 2.87 లక్షల కోట్లతో జల్ జీవన్ పథకాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

టీం ఇండియా మాదిరి…..

ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా మాదిరిగా భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్తగా నగర్ స్వచ్ఛ్ భారత్ ను ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. నేషన్ ఫస్ట్ లో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్డెట్ ఊతమిస్తుందని చెప్పారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద 2.75 లక్షల కోట్ల సాయాన్ని అందించామని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు.

వివిధ పథకాల కోసం…..

రక్షిత మంచినీటి పథకాల కోసం 87 వేల కోట్లు కేటాయించామన్నారు. 8 కోట్లమందికి ఉచితంగా గ్యాస్ అందిస్తున్నట్లు తెలిపారు. 500 నగరాల్లో మురుగునీటి శుద్ది కర్మాగారాలు ఏర్పాటు చేశామన్నారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబ్ లను ఏర్పాుట చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడేళ్లలో ఏడు టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. నిర్మలా సీతారామన్ డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఆరోగ్యరంగానికి, రెండో ప్రాధాన్యతను మౌలిక వసతుల రంగానికి ఇచ్చిందని తెలిపారు.

Tags:    

Similar News