నిమ్మగడ్డ దగ్గరకు వెళ్లం..భీష్మించిన ఉద్యోగులు

రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు అంగీకరించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సెలక్షన్ ప్రాసెస్ [more]

Update: 2021-01-20 03:41 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు అంగీకరించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సెలక్షన్ ప్రాసెస్ చేపట్టింది. ఈ సెలక్షన్ ప్రాసెస్ కు హాజరవ్వాలని ప్రభుత్వ ఆదేశాలను ఉద్యోగులు పట్టించుకోలేదు. ఇప్పటి వరకూ 12 మంది ఉద్యోగులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో పనిచేసేందుకు జాబితాను రూపొందించింది. అందులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముగ్గురిని ఎంపిక చేసింది. అయితే వారు మాత్రం తాము రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో పనిచేయలేమని చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఉద్యోగుల సంఘం కూడా ఇదే చెబుతోంది. ఉద్యోగులు అంగీకారంతోనే అక్కడకు పంపుతామని ప్రభుత్వం చెబుతోంది.

Tags:    

Similar News