బ్రేకింగ్ : సీఎస్ కు నిమ్మగడ్డ ఘాటు కౌంటర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి కౌంటర్ ఇచ్చారు. ఆయన సీఎస్ కు లేఖ రాశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికల [more]

Update: 2020-03-17 06:42 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి కౌంటర్ ఇచ్చారు. ఆయన సీఎస్ కు లేఖ రాశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎన్నికల వాయిదా వేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత భయపెడుతుందో అందరికీ తెలుసునన్నారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే ఎన్నికలను వాయిదా వేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోతే కేంద్ర నిధులు ఆగపోతాయని అంటున్నారని, కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చుకోవచ్చని సూచించారు. తనకు ఎటువంటి రాగద్వేషాలు లేవని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖతో మాట్లాడిన తర్వాతనే తాను ఎన్నికలను వాయిదా వేశానని లేఖలో చెప్పారు. తాను తీసుకున్న వాయిదా నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. మొత్తం మూడు పేజీల లేఖను నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ కు రాశారు.

Tags:    

Similar News