నిమ్మగడ్డ పిటీషన్ విచారణకు నో

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ ను విచారించేందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. ఈ అంశం చీఫ్ జస్టిస్ పరిధిలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. [more]

Update: 2021-03-20 07:31 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ ను విచారించేందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. ఈ అంశం చీఫ్ జస్టిస్ పరిధిలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ ను న్యాయమూర్తి పక్కన పెట్టారు. ఇది తన పరిధిలో లేదని చెప్పారు. గవర్నర్ కార్యాలయంలో తాను జరిపిన ప్రత్యుత్తరాలు ఎలా లీకయ్యాయో విచారించాలని, సీబీఐ తోనే విచారణ జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ పరిశీలించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News