తొలిసారి రీపోలింగ్ లేకుండా ఎన్నికలు

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రీపోలింగ్ ఎక్కడా లేదని ఆయన చెప్పారు. రీపోలింగ్ లేకుండా ఎన్నికలను నిర్వహించడం [more]

Update: 2021-03-11 01:17 GMT

మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. రీపోలింగ్ ఎక్కడా లేదని ఆయన చెప్పారు. రీపోలింగ్ లేకుండా ఎన్నికలను నిర్వహించడం ఇదే తొలిసారి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పోలీసులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు. వార్డు వారలంటగీర్లు ఎన్నికలలో పాల్గొన్న సందర్భాలను రికార్డు చేస్తామని, హైకోర్టు తీర్పు అనంతరం వారిపై చర్యలుంటాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఈనెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్, మేయర్, డిప్యూటీ ఛైర్మన్ పదవులకు ఎన్నికను త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు.

Tags:    

Similar News