న్యాయపరమైన చిక్కులు తొలిగిన తర్వాతే ఆ ఎన్నికలు

పంచాయతీ ఎన్నికల జరిగిన తీరుపట్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని [more]

Update: 2021-02-22 04:49 GMT

పంచాయతీ ఎన్నికల జరిగిన తీరుపట్ల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పూర్తిగా సహకరించారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ప్రతి విడతలోనూ 80 శాతం పోలింగ్ జరిగిందన్నారు. ప్రధానంగా కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్యశాఖ తీసుకున్న జాగ్రత్తలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యాయపరమైన అవరోధాలు తొలిగిపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుపుతామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ఎక్కడయితే ఆగాయో అక్కడి నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ఓటర్లు విరివిగా పాల్గొనాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. సమన్వయంతో పనిచేసిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆయన అభినందించారు. కేవలం పదహారు శాతం మాత్రమే ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. డీజీపీ, సీఎస్ లకు తనకు ఎప్పటికప్పుడు విలువైన సూచనలు ఇచ్చారని చెప్పారు.

Tags:    

Similar News