కఠినంగా వ్యవహరించండి.. సీఎస్ కు ఆదేశం

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఇవాళ ఢిల్లీలో ట్రైబ్యునల్ తో సీఎస్ సమావేశమ్యారు. [more]

Update: 2019-04-26 11:44 GMT

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఇవాళ ఢిల్లీలో ట్రైబ్యునల్ తో సీఎస్ సమావేశమ్యారు. రాష్ట్రంలో ఇసుక యధేచ్ఛ తవ్వకాలు జరిపారని, ఇసుక అక్రమంగా తవ్వకాలు జరిపిన వారికి భారీగా జరిమినాలు వెయ్యాలని ట్రైబ్యునల్ సూచించింది. రాష్ట్రంలో కాలుష్యాన్ని సైతం నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది. విశాఖపట్నం, విజయవాడలో వాయుకాలుష్యం సైతం ఎక్కువగా ఉందని, వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, సీఎస్ నేరుగా వీటిని పర్యవేక్షించాలని సూచనలు చేసింది. ఆరు నెలల తర్వాత మరోసారి ఏపీపై సమీక్షలు జరుపుతామని ట్రైబ్యునల్ తెలిపిందే.

Tags:    

Similar News