న్యూజిలాండ్ ఆ రెండు తప్పులూ

క్రికెట్ లో ఓడిపోయే మ్యాచ్ లను కూడా గెలిపించేది ఫీల్డింగ్. గెలిచే మ్యాచ్ లను సైతం కూడా చెత్త ఫీల్డింగ్ కారణంగా ఓడిపోయే పరిస్థితి ఎదురౌతుంది. ఇక [more]

Update: 2019-07-15 02:29 GMT

క్రికెట్ లో ఓడిపోయే మ్యాచ్ లను కూడా గెలిపించేది ఫీల్డింగ్. గెలిచే మ్యాచ్ లను సైతం కూడా చెత్త ఫీల్డింగ్ కారణంగా ఓడిపోయే పరిస్థితి ఎదురౌతుంది. ఇక క్యాచ్ లు సైతం అంతే మ్యాచ్ ల తలరాతలనే మార్చేస్తాయి. ఖచ్చితంగా గెలవాలిసిన కప్ ను న్యూజిలాండ్ చేతులారా చేజార్చుకోవటానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఒక్క ఓవర్ త్రో మ్యాచ్ ఫలితాన్నే శాసించింది అని తేలుతుంది. చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు చేయాలిసిన దశలో స్టోక్స్ బంతిని బౌండరీని బాదే ప్రయత్నం విజయవంతంగా అడ్డుకున్నారు కివీస్ ఫీల్డర్లు. అయితే కీపర్ కి త్రో విసిరే సమయంలో వత్తిడితో గురి తప్పడంతో బాల్ బౌండరీ చేరింది. దాంతో రెండు పరుగులతో సరిపెట్టుకోవాలిసిన ఇంగ్లాండ్ కి అదృష్టం కలిసి వచ్చి ఆరుపరుగులు లభించాయి.

క్యాచ్ పట్టి లైన్ తొక్కి ….

అదేవిధంగా స్టోక్స్ కొట్టిన ఒక షాట్ ను బౌండరీ వద్ద పట్టి లైన్ తాకడంతో మరో ఆరుపరుగులు న్యూజిలాండ్ సమర్పించుకోవాలి వచ్చింది. ఇలా నిరోధించే అవకాశం ఉన్నప్పటికీ 10 పరుగులు అదనంగా ఇంగ్లాండ్ కి సర్పించుకోవాలిసి రావడంతో కివీస్ తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోలేక పోయిందని క్రీడా విశ్లేషకుల అంచనా. కివీస్ ఫీల్డర్లు కీలక సమయాల్లో చేసిన తప్పులే ఆ టీం కి శాపాలు అయ్యాయి. దాంతో టాస్ గెలిస్తే అదృష్టం తమదే అన్న ధీమాతో పాటు ఒక టీం గా గెలుపుకోసం తుదికంటా పోరాడినా ఫలితం దక్కలేదు కివీస్ కి. అయితే కెన్ విలియమ్సన్ సారధ్యంలోని కివీస్ బ్యాటింగ్, బౌలింగ్ ఫీల్డింగ్ లలోవత్తిడిని జయించి అద్భుతంగా రాణించినా ఈసారి కూడా కప్ వారిని వెక్కిరించి తీవ్ర నిరాశే అందించింది. ఫైనల్ లో మ్యాచ్ టై అయినా సూపర్ ఓవర్ టై అయినా కేవలం బౌండరీల ఆధిపత్యంతో నిబంధనల మేరకు ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడం కివీస్ కి మరోసారి వరల్డ్ కప్ అందని ద్రాక్షగానే ఉండిపోయింది.

Tags:    

Similar News