దీపావళి వరకూ పేదలందరికీ ఉచిత రేషన్

దేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ [more]

Update: 2020-06-30 12:15 GMT

దేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ కోరారు. ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నిరుపేదలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. అందుకే కరోనా విపత్తు సమంయలో ప్రజలను ఆదుకునేందుకు గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్లుమోదీ ప్రకటించారు. దీని ద్వారా 80 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారని మోదీ తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభువ్ం 90 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దీపావళి వరకూ పేదలకు ఉచితంగా రేషన్ అందించనున్నట్లు మోదీ వెల్లడించారు. కరోనా మహ్మమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ను విధిగా ధరించాలని కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా స్థానికసంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News