తగులుకుంటే....వదలరే....!!!

Update: 2018-11-29 05:13 GMT

చంద్రబాబు తగులుకుంటే వదిలిపెట్టరన్న సామెత రాజకీయ వర్గాల్లో నలుగుతూనే ఉంటుంది. అది బీజేపీతోనైనా మరే పార్టీతోనైనా ఆయన పొత్తుకు దిగితే ఏ అవకాశాన్ని వదిలిపెట్టరన్నది పార్టీలోనే విన్పించే టాక్. తాజాగా రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చారు. నిన్న మొత్తం రాహుల్ వెంట బహిరంగసభలు, రోడ్ షోలలో పాల్గొన్న చంద్రబాబు ఈరోజు రాహుల్ ను బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు పిలిచారు. పార్క్ హయత్ హోటల్ లో ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరగనుంది. ఇదే హోటల్ లో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయవతి కూడా ఉన్నారు. ఆమెను కూడా చంద్రబాబు ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోరన్న ఆ పార్టీ నేతల మాటలను నిజం చేస్తూ రాహుల్ తో మరోసారి సమావేశమవుతున్నారు. చంద్రబాబునాయుడు అంతేనని, తగులుకుంటే వదలరని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం.

Similar News