ఏంటీ ప‌క్ష‌పాతం..? నారా లోకేష్ ఆవేద‌న‌..!

ఎన్నిక‌ల కోడ్ కేవ‌లం ఏపీలోనే ఉందా..? ఈసీ ఆంక్ష‌లు కేవ‌లం టీడీపీ వ‌ర్తిస్తాయా అని మంత్రి నారా లోకేష్ ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు స‌మీక్ష‌లు జ‌ర‌ప‌వ‌ద్ద‌నడాన్ని [more]

Update: 2019-04-20 12:57 GMT

ఎన్నిక‌ల కోడ్ కేవ‌లం ఏపీలోనే ఉందా..? ఈసీ ఆంక్ష‌లు కేవ‌లం టీడీపీ వ‌ర్తిస్తాయా అని మంత్రి నారా లోకేష్ ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు స‌మీక్ష‌లు జ‌ర‌ప‌వ‌ద్ద‌నడాన్ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. ఎండ‌లు, తాగునీటిపై ముఖ్య‌మంత్రి స‌మీక్ష జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌ని, కోడిగుడ్డు మీద ఈక‌లు పీకే బుద్ది మార‌దా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లోనూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష‌లు జ‌రుపుతున్నార‌ని, సీఎస్‌, డీజీపీ కూడా స‌మీక్ష‌ల్లో పాల్గొంటున్నార‌ని పేర్కొన్నారు. అక్క‌డి స‌మీక్ష‌ల ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల‌ను ఐ ఆండ్ పీఆర్ అధికారికంగా ఇస్తుంద‌న్నారు. తెలంగాణ‌లో కోడ్ వ‌ర్తించ‌దా అని ప్ర‌శ్నించారు. ఏంటీ ప‌క్ష‌పాతం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News