నాకు ఇంగ్లీష్ రాదా?

తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాము ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు [more]

Update: 2019-12-11 04:45 GMT

తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాము ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కూడా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మాతృభాష ను విస్మరించకూడదన్నారు. వైసీపీదీ అవకాశవాద రాజకీయమన్నారు. తనకు ఇంగ్లీష్ రాదని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారని, తన హయాంలోనే బుష్, టోనీ బ్లెయిర్, బిల్ క్లింటన్ లాంటి వాళ్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అనవసరంగా రెచ్చగొడితే వదిలిపెట్టే ప్రసక్తిలేదన్నారు.

దిక్కుమాలిన ఆలోచనలు….

దీనిపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తన బినామీ సంస్థ నారాయణకు మేలు చేయాలని ప్రభుత్వ పాఠశాలలను చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటే వారి భవిష్యత్ బాగుంటుందనే నిర్ణయం తీసుకున్నామన్నారు. చంద్రబాబు ఏది చేసినా రాజకీయం, వక్రీకరణ కన్పిస్తుందన్నారు. నలభై సంవత్సరాలు అనుభవమున్న చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబువి దిక్కుమాలిన ఆలోచనలని జగన్ అన్నారు.

స్పీకర్ వర్సెస్ చంద్రబాబు…..

ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్టాడుతూ యాభై ఏళ్ల నుంచి చంద్రబాబు ఎంఫిల్ చేస్తూనే ఉన్నారన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడానికి ప్రయత్నించగా స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు స్పీకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని మాట్టాడివ్వడం లేదని, మర్యాదగా ఉండదని అనడంతో స్పీకర్ ఫైరయ్యారు. నలభై ఏళ్ల అనుభవం ఇదేనా? అని స్పీకర్ ఆగ్రహించారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబును సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News