విద్యార్థి హత్య కేసులో జీవిత ఖైదు

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన విద్యార్థి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది . ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో అనూష ని అతికిరాతకంగా వెంకట్ హత్య చేశాడు.. [more]

Update: 2021-01-21 01:35 GMT

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన విద్యార్థి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది . ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో అనూష ని అతికిరాతకంగా వెంకట్ హత్య చేశాడు.. ప్రేమ పేరుతో వంచించి హత్య చేశారు. యూనివర్సిటీ క్యాంపస్ పక్కనే ఉన్న కాలనీలో ఉండే వెంకట్ అనూష కొన్నాళ్ళపాటు ప్రేమించుకున్నారు. తర్వాత కాలంలో అనూష వెంకట్ ను పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో అనూష పైన వెంకట్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏవిధంగానైనా మట్టుపెట్టాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా అనూష ని మాట్లాడుకుందామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో కి తీసుకు వచ్చాడు. అక్కడ అమ్మాయి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. అతి కిరాతకంగాఅనూష ని హత్య చేసి పారిపోయాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంకట్ ని ఒక్కరోజులోనే అరెస్ట్ చేశారు. ఈ కేసు పైన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు వెంటనే చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై వాదప్రతివాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు వెంకట్ ను దోషిగా ప్రకటించింది. అంతేకాకుండా వెంకట్ కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది.

Tags:    

Similar News