వాడికి అంత సీన్ లేదని తెలుసు

నిర్మాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటానంటూ చేసిన మాటలు ఎంత సంచలనం అయ్యాయో [more]

Update: 2018-12-31 06:59 GMT

నిర్మాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటానంటూ చేసిన మాటలు ఎంత సంచలనం అయ్యాయో వేరే చెప్పనవసరం లేదు. ఆ ఇన్సిడెంట్ తరువాత కొందరు మీడియా వారు గణేష్ కోసం వెతికారు. చివరికి గణేష్ కనిపించడంతో మీరు పీక కోసుకుంటా అన్నారు కదా అంటే… ఫ్లోలో వంద అంటాం అని అన్నాడు. అయితే దీనిపై యాక్టర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… ‘‘బండ్ల గణేష్ తన పార్టీపై నమ్మకంతో కాస్త ఎక్కువ మాట్లాడాడు.. తప్పులేదు. కానీ అసలు వీడికి ఇంత నమ్మకం ఏంటి? ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ? అని అనుకున్న. తెరాస భారీ మెజారిటీతో గెలవకపోవచ్చు కానీ, మ్యాజిక్ ఫిగర్‌తో మాత్రం గెలుస్తుందని అనే నమ్మకం నాకు ముందు నుంచే ఉంది. నేను మా పిల్లలం అంతా టీఆర్ఎస్‌కి ఓటేశాం.’’

బండ్ల గణేష్ కు షాక్ ఇచ్చారుగా…

‘‘గెలిచిన తరువాత గణేష్ ఇంటర్వ్యూ చూడాలని ఉంది. ఎందుకంటే అతను బాగా కామెడీ చేస్తాడు. ఇటువంటి ఫన్ అతని సినిమాల్లో పెట్టుకుంటే పెద్ద కమెడియన్ అయ్యుండేవాడు. ఓడిపోతే నిజంగా పీక కోసుకునే అంత సీన్ గణేష్ కు లేదని నాకు ముందే తెలుసు. గెలిచిన తరువాత ‘వంద అంటామండీ’ అని అంటాడని కూడా తెలుసు. ఒకవైపు రేవంత్ రెడ్డి ఆవేశపూరిత ప్రసంగాలు.. మరోవైపు గణేష్ గాడి కామెడీ స్పీచ్ లతో బాగా ఎంటర్టైనర్ చేసాడు. అందుకు వాడిని మెచ్చుకోవాలి.’’ అని నాగబాబు బండ్ల గణేష్ ను చాలా లైట్ తీసుకున్నాడు. మెగా ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీ అని చెప్పుకుని తిరిగే గణేష్ కు నాగబాబు వ్యాఖ్యలు షాకింగే.

Tags:    

Similar News