బాంబు పేల్చిన నవాజ్ షరీఫ్

Update: 2018-05-12 11:56 GMT

ముంబయిపై 2008 నవంబరు 26న జరిగిన దాడులు పాకిస్థాన్ పనేనని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. ఈ మేరకు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు చెందిన మీడియా సంస్థ ‘డాన్’కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ... ముంబయి దాడులకు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వెళ్లారని స్పష్టంచేశారు. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ ఎందుకు విచారణ పూర్తి చేయడం లేదని షరీఫ్ ప్రశ్నించారు. ఈ ఘటన వెనుక సూత్రాధారి అయిన హఫీజ్ సయీద్ బయట ఎలా తిరగగలుగుతున్నాడని ఆయన ప్రశ్నించారు.కసబ్ తో సహా లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం మీదుగా ముంబయి చేరి ఈ దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రిడెంట్ హోటల్, ఛత్రపతి శివాజి టర్మినస్ పై మూడు రోజుల పాటు దాడి చేసి 166 మంది అమాయక పౌరులను పొట్టనపెట్టుకున్నారు.

Similar News