మందకృష్ణ అరెస్ట్

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా ఇందిరాపార్కు రోడ్లను మూసివేశారు. వాహన రాకపోకలు [more]

Update: 2019-11-17 05:35 GMT

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా ఇందిరాపార్కు రోడ్లను మూసివేశారు. వాహన రాకపోకలు పైన ఆంక్షలు విధించారు. ఇందిరా పార్క్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తారని సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ కొన్ని అసాంఘిక శక్తులు కలిసి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఉందని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఒక హోటల్లో తలదాచుకున్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు .

Tags:    

Similar News