బ్రేకింగ్ : విజయారెడ్డి డ్రైవర్ మృతి

ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ గురునాధం మృతి చెందారు. నిన్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన [more]

Update: 2019-11-05 05:43 GMT

ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ గురునాధం మృతి చెందారు. నిన్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. విజయారెడ్డి చుట్టూ ఉన్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఆమె డ్రైవర్ గురునాధం కూడా తీవ్రగాయాలపాలయ్యాడు. గురునాధంకు దాదాపు 80 శాతం మేర గాయాలు కావడంతో వెంటనే ఆయనను డీర్ డీఏ అపోలో ఆసుపత్రికి తరలించారు. చికత్స పొందుతూ గురునాధరెడ్డి మృతి చెందారు. విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ గురునాధం కూడా మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.

రెవెన్యూ సంఘాల నిరసన….

విజయారెడ్డి హత్యపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. ఈ దారుణం గురించి తెలియగానే భారీ సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్ – విజయవాడ హైవేపై బైఠాయించారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వారికి సర్దిచెప్పి.. నిరసన విరమింపజేశారు.

విధుల బహిష్కరణ….

ఇది అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి అన్నారు. ఈ దారుణ ఘటనపై నిరసనగా రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులంతా విధులను బహిష్కరించారని చెప్పారు. మంగళవారం విజయారెడ్డి అంతిమ యాత్ర లో పాల్గొనడానికి హైదరాబాద్ కు రావాలని రెవెన్యూ ద్యోగులకు పిలుపునిచ్చారు. విజయారెడ్డి మృతికి సంతాపంగా మూడు రోజుల పాటు విధులను బహిష్కరించి నిరసన తెలపాలన్నారు.

Tags:    

Similar News