రేవంత్ రెడ్డి జీవితమంతా బ్లాక్ మెయిలింగే

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి జీవితమంతా బ్లాక్ మెయిలింగేనని అన్నారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ [more]

Update: 2021-08-29 05:52 GMT

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి జీవితమంతా బ్లాక్ మెయిలింగేనని అన్నారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పల్లెల్లోకి రానివ్వవద్దని మోత్కుపల్లి నరసింహులు పిలుపు నిచ్చారు. దళితబంధును అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారన్నారు. ఎంత ఖర్చయినా దళితబంధును అమలు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. రేవంత్ రెడ్డి మాయమాటలు ఎవరూ నమ్మవద్దని ఆయన దీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News