మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ....!

Update: 2018-06-28 12:52 GMT

మెడికల్ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సి సి యస్ పోలీసులు అరెస్ట్ చేశారు .ఢిల్లీ కి చెందిన సంతోష్ కుమార్ మనోజ్ కుమార్ లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన యువతి నుండి పీజీ మెడికాల్ సీట్ ఇప్పిస్తామని 81 లక్షలు విడతల వారీగా వసూలు చేశారు. ఢిల్లీ లోనూ మరో వ్యక్తి నుండి మెడికల్ సీట్ కోసం 68 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. నిందితులపై కర్ణాటక ,ఢిల్లీ ముంబై లో 16కు పైగా కేసులున్నట్లు పోలీసులు కనుగొన్నారు. వీరి నుండి నకిలీ స్టాంపులు ,నకిలీ ధ్రువ పాత్రలు,బాంక్ పాస్ బుక్స్ ,లాప్టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

సీటు కన్ఫర్మ్ అంటూ.....

ఢిల్లీకి చెందిన సంతోష్ కుమార్ రాయ్, మనోజ్ కుమార్ ముఠా సభ్యులు. ఢిల్లీ కేంద్రంగా మోసాలకు తెర లేపింది ఈగ్యాంగ్. మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకునేవారి వివరాలు ముందు సేకరిస్తారు. మెయిల్ ద్వారా మీకు నచ్చిన కాలేజీలో మెడికల్ సీట్లు ఇప్పిస్తామని బాధితులకు వల వేస్తుంది ఈ గ్యాంగ్. దేశంలోని వివిధ మెడికల్ కాలేజీలో పిజి తోపాటు సెంట్రల్ మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కోటాలో, మేనేజ్ మెంట్ కోటా కింద మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మోసం చేస్తారు. సీట్లు కన్ఫర్మ్ అని చెపి సెంట్రల్ మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి చెందిన నకిలీ మెయిల్ తో మెసేజ్ లు పంపుతారు ముఠా సభ్యులు. మెడికల్ సీట్ల పేరుతో బాధితుల నుంచి లక్షలు వసూల్ చేశారు వీరు. వీరిద్దరినీ ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News