ఖాళీ అయిపోతున్న భాగ్యనగరం

సంక్రాంతి పండగ వస్తుంది అంటే భాగ్యనగరం ఖాళీ అయిపోతుంది. మకరసంక్రాంతి కి సొంత ఊర్లకు వెళ్లేందుకు బయల్దేరుతున్నారు జనం. అంతా ఒక్కసారే జన్మభూమి బాట పట్టడంతో రైళ్ళు, [more]

Update: 2019-01-11 03:29 GMT

సంక్రాంతి పండగ వస్తుంది అంటే భాగ్యనగరం ఖాళీ అయిపోతుంది. మకరసంక్రాంతి కి సొంత ఊర్లకు వెళ్లేందుకు బయల్దేరుతున్నారు జనం. అంతా ఒక్కసారే జన్మభూమి బాట పట్టడంతో రైళ్ళు, బస్సులు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. విపరీతమైన రద్దీ ఒక వైపు, ఆకాశాన్ని అంటేలా డబుల్ త్రిబుల్ రేట్లతో టికెట్ల మోతతో ప్రయాణికులు పండగ ముందు నరకం చూస్తున్నారు. ఇక రైల్వే స్టేషన్లు ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికుల రద్దీతో నరకాన్ని తలపిస్తున్నాయి.

పిండేస్తున్న ప్రభుత్వ, ప్రయివేట్ ట్రావెల్స్ …

ప్రయివేట్ ట్రావెల్స్ సంగతి చెప్పఖ్ఖర్లేదు. అయితే ప్రభుత్వ పరిధిలో పనిచేసే రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలు కూడా అధిక టికెట్ల రేట్లతో అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటూ దోపిడీ సాగిస్తున్నారు. దాంతో తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో ప్రయాణికులకు అర్ధం కావడం లేదు. ప్రతి ఏటా సంక్రాంతి పండగ కు అపరిమితంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీనికి అనుగుణంగా అదనపు రైళ్లను, బస్సులను ప్రవేశపెడుతున్నా. ఎక్కడా చాలడం లేదు. సర్కార్ సంస్థలే దోపిడీ దారులుగా వున్నప్పుడు ప్రతి ఏటా ఇదే నరకం ప్రయాణికులకు ఎదురు కాక తప్పదు. తమ సొంత వూరి బాట పట్టినవారి స్థితి ఇలా ఉంటే హైదరాబాద్ లో పండగకు వుండేవారంతా నిత్యం వుండే ట్రాఫిక్ లేక హాయిగా రివ్వున తిరుగుతు ఉండటం విశేషం.

 

Tags:    

Similar News