బ్రేకింగ్ : వారికి కళ్లుతిరిగే షాకిచ్చిన జగన్.. కోలుకోలేరా?

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు మళ్లీ పెరిగాయి. మరో యాభై శాతం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీలో మద్యం ధరలు [more]

Update: 2020-05-05 07:43 GMT

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు మళ్లీ పెరిగాయి. మరో యాభై శాతం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీలో మద్యం ధరలు 75 శాతం పెరిగినట్లయింది. 120 బ్రాండ్ మద్యం బాటిల్ పై నలభై రూపాయలు పెంచింది. బీర్లుపై అరవై రూపాయలు పెంచింది. నిన్న తొలిరోజు 25 శాతం ధరలను ప్రభుత్వం పెంచింది. రెండు రోజుల్లోనే ఏపీలో మద్యం ధరలను 75 శాతం పెంచింది. నిన్న మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు క్యూకట్టారు. సోషల్ డిస్టెన్స్ కూడా పాటించలేదు. దీంతో మద్యం ధరలను మరోసారి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. నిన్న ఒక్కరోజే నలభై కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరిగాయి. మద్యం వినియోగాన్ని తగ్గించేేందుకే ధరలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది.

Tags:    

Similar News