లతకు అస్వస్థత

భార‌తీయ చ‌ల‌న‌చిత్ర సినీ సంగీత రంగాన్ని అనేక ద‌శాబ్దాల పాటు ఏక‌చ్ఛత్రాధిప‌త్యంగా ఏలిన ప్రముఖ నేప‌థ్య గాయ‌ని ల‌తా మంగేష్కర్ తీవ్ర అస్వస్థత‌కు గుర‌య్యారు. శ్వాస‌కోశ సంబంధిత [more]

Update: 2019-11-12 01:35 GMT

భార‌తీయ చ‌ల‌న‌చిత్ర సినీ సంగీత రంగాన్ని అనేక ద‌శాబ్దాల పాటు ఏక‌చ్ఛత్రాధిప‌త్యంగా ఏలిన ప్రముఖ నేప‌థ్య గాయ‌ని ల‌తా మంగేష్కర్ తీవ్ర అస్వస్థత‌కు గుర‌య్యారు. శ్వాస‌కోశ సంబంధిత స‌మ‌స్యల‌తో బాధ ప‌డుతున్న ఆమెను సోమ‌వారం తెల్లవారుఝామున 1.30 గంట‌ల స‌మ‌యంలో ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచీ ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. లతా మంగేష్కర్ ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్టు ఒక ద‌శ‌లో వార్తలు వ‌చ్చాయి.

నిలకడగానే ఉందని…..

ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, మంగ‌ళ‌వారం డిశ్చార్జ్ చేస్తార‌ని ల‌త సోద‌రి ఉషా మంగేష్కర్ సోమ‌వారం రాత్రి ప్రక‌టించారు. ల‌త త్వర‌గా కోలుకుని సుర‌క్షితంగా ఇంటికి చేరాల‌ని ఆమె అభిమానులు భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నారు. మ‌ధుర గాయ‌ని ల‌తా మంగేష్కర్ వ‌య‌సు 90 ఏళ్లు. ఈ సెప్టెంబ‌ర్ 28న ఆమె 90వ ప‌డిలో అడుగు పెట్టారు. ఏడు ద‌శాబ్దాల‌కుపైగా సినీ సంగీత ప్రియుల్ని మ‌ధుర గానంతో ఓల‌లాడించిన మ‌హా గాయ‌ని ఆమె. హిందీలోనే వెయ్యికి పైగా సినిమాల్లో వేల పాట‌లు పాడారు. 1989లో దాదా సాహెబ్ పుర‌స్కారాన్ని, 2001లో భారత అత్యున్నత పౌర పుర‌స్కారం భార‌త‌ర‌త్నను ఆమె అంద‌కున్నారు.

Tags:    

Similar News