ఆసక్తికరంగా కేటీఆర్, మహేష్ ల ట్వీట్లు

Update: 2018-06-02 08:21 GMT

తెలంగాణ యువ మంత్రి కేటీఆర్, హీరో మహేష్ బాబులు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఈ మధ్య విడుదలైన భరత్ అనే నేను సినిమాతో వీరి మధ్య రిలేషన్ ఇంకా పెరిగింది. ఇద్దరూ కలిసి సినిమా విడుదలైన సందర్భంలో ఓ ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమంలోనే మహేష్ బాబు కేవలం అమ్మాయిలకు మాత్రమే సెల్ఫీలు ఇస్తారని, కానీ, నేను అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తానని మంత్రి కేటీఆర్ సరదాగా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకున్న ఓ యువకుడు కేటీఆర్ తో సెల్ఫీ దిగి ‘నిజమే, కేటీఆర్ గారు అబాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తారు’ అని ట్విట్టర్ లో పెట్టాడు. దీనిని కేటీఆర్..మహేష్ బాబుకు ట్యాగ్ చేస్తూ ‘ఇది నీ కోసమే’ అని ట్విట్ చేశారు. దీనికి స్పందించిన మహేష్ ఓ స్మైలీతో రిప్లై ఇచ్చారు. ఇలా కేటీఆర్, మహేష్ ల స్నేహం ట్విట్టర్ ద్వారా బయటపడుతోంది.

Similar News