కలకత్తాలో విపక్షాల బలప్రదర్శన.. తరలివెళ్లిన నేతలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కలకత్తాలో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్షాల ‘యునైటెడ్ ఇండియా‘ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీకి [more]

Update: 2019-01-19 06:51 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కలకత్తాలో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా విపక్షాల ‘యునైటెడ్ ఇండియా‘ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీకి లక్షల సంఖ్యలో ప్రజలు, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. విపక్షాల బలప్రదర్శనగా చెప్పుకుంటున్న ఈ ర్యాలీకి బీజేపీ వ్యతిరేక పక్షాల నేతలు హాజరయ్యారు. మాజీ ప్రధాన దేవెగౌడ, ఏపీ, కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కుమారస్వామి, అరవింద్ కేజ్రీవాల్, వివిధ పార్టీల నేతలు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా, శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, తేజస్వీ యాదవ్, గెగాంగ్ అపాంగ్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున మల్లిఖార్జున్ ఖర్గే ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ లేఖ ద్వారా ర్యాలీకి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకునేందుకు నిరాకరించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ ర్యాలీకి హాజరుకాలేదు.

Tags:    

Similar News