కోడెల ఫోన్ కోసం?

మాజీ స్పీకర్ కోడెల శిపవ్రసాదరావు మొబైల్ ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన మరణించిన తర్వాత నుంచి కోడెల శివప్రసాద్ ఫోన్ పోలీసులకు కన్పించడం లేదు. కోడెల [more]

Update: 2019-09-18 02:06 GMT

మాజీ స్పీకర్ కోడెల శిపవ్రసాదరావు మొబైల్ ఫోన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆయన మరణించిన తర్వాత నుంచి కోడెల శివప్రసాద్ ఫోన్ పోలీసులకు కన్పించడం లేదు. కోడెల శివప్రసాద్ ఫోన్ ఆయన కుటుంబ సభ్యుల వద్ద ఉండి ఉంటుందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. కోడెల శివప్రసాద్ చివరిసారిగా దాదాపు 25 నిమిషాలో ఒక వ్యక్తితో మాట్లాడినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. మొబైల్ లో వాట్సాప్ ను చివరిసారిగా ఆరోజు ఉదయం ఆరుగంటలకు కోడెల శివప్రసాద్ చూసినట్లు తెలుస్తోంది. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల వద్ద నుంచి ఫోన్ తీసుకోవాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. మొబైల్ ఫోన్ దొరికితేనే ఈ కేసులో కీలక ఆధారాలు లభించే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News