కోడెల కుటుంబం సహకరించడం లేదా?

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసులో పురోగతి ఏమాత్రం లేదు. హైదరాబాద్ పోలీసులు కోడెల ఆత్మహత్య కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల [more]

Update: 2019-10-14 06:34 GMT

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసులో పురోగతి ఏమాత్రం లేదు. హైదరాబాద్ పోలీసులు కోడెల ఆత్మహత్య కేసును ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాంను విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినా ఆయన రాలేదు. గతంలో నోటీసులు జారీ చేసినా కోడెల శివరామ్ పట్టించుకోలేదు. తనకు ముఖ్యమైన కార్యక్రమాలున్నందున రాలేకపోతున్నానని ఆయన పోలీసులకు చెబుతున్నారు. కోడెల శివప్రసాద్ సతీమణిని కూడా పోలీసులు విచారించాల్సి ఉంది. అయితే వీరు రాకపోవడంతో నేరుగా తెలంగాణ పోలీసులు గుంటూరు వెళ్లి కోడెల శివరామ్, కోడెల శివప్రసాద్ సతీమణి స్టేట్ మెంట్లు రికార్డు చేశారు.

వత్తిడి వల్లనే…..

తనకు, తండ్రిక మధ్య ఎలాంటి గొడవలు లేవని, కేవలం ప్రభుత్వ వత్తిడికారణంగానే ఆత్మహత్యచేసుకున్నారని కోడెల శివరామ్ పోలీసులకు వివరించారు. అంతేకాకుండా తాను కోడెల మరణించడానికి ముందే విదేశాలకు వెళ్లానని తెలిపారు. ఆయన చనిపోయారని తెలిసే ఇండియాకు వచ్చానన్నారు. కోడెల భార్య కూడా ఆయన ఆత్మహత్యచేసుకునే ముందు తనతో బాగానే మాట్లాడారనిచెప్పారు. అందరం కలసి టిఫిన్ కూడాచేశామని పోలీసులకు తెలిపారు. తన భర్త దేనికీ భయపడే వారు కారని, కానీ కొన్ని కేసులు ఆయనను ఇటీవల కాలంలో ఇబ్బంది పెట్టాయని చెప్పారు.

Tags:    

Similar News