నా ఇంట్లో చోరీ చేసింది వైసీపీ

తన ఇంట్లో కంప్యూటర్లు చోరీ చేసిన వ్యక్తి వైసీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గతంలో అర్జున్ అనే వ్యక్తి తన [more]

Update: 2019-08-23 05:56 GMT

తన ఇంట్లో కంప్యూటర్లు చోరీ చేసిన వ్యక్తి వైసీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. గతంలో అర్జున్ అనే వ్యక్తి తన ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన మాట వాస్తవేమనని, ఇప్పుడు అర్జున్ వైసీపీ లో పనిచేస్తున్నారని కోడెల శివప్రసాద్ తెలిపారు. నిన్న రాత్రి అర్జున్ తన కార్యాలయానికి వచ్చి కంప్యూటర్లను చోరీ చేశారన్నారు. తమ పార్టీకి సంబంధించి డేటాను చోరీ చేయడానికి అర్జున్ వచ్చినట్లుందన్నారు. దీనిపై అంబటి రాంబాబు సమాధానం చెప్పాలన్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు.

Tags:    

Similar News