కేసీఆర్ తో భేటీకి స్టాలిన్ నో..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో డీఎంకే చీఫ్ స్టాలిన్ భేటీ లేన‌ట్లు తెలుస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు గానూ కేసీఆర్ నిన్న కేర‌ళ‌, [more]

Update: 2019-05-07 12:56 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో డీఎంకే చీఫ్ స్టాలిన్ భేటీ లేన‌ట్లు తెలుస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు గానూ కేసీఆర్ నిన్న కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. నిన్న కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ను క‌లిసి ఈ మేర‌కు ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. షెడ్యూల్ ప్ర‌కారం అయితే ఈ నెల 13వ తేదీ కేసీఆర్ చెన్నైలో స్టాలిన్ ను క‌ల‌వాల్సి ఉంది. కానీ, ఉప ఎన్నిక‌లు ఉన్నందున తాను ప్ర‌చారం బిజీలో ఉన్నందున ఇప్పుడు క‌లిసే అవ‌కాశం లేద‌ని స్టాలిన్ సున్నితంగా చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స్టాలిన్ ఇప్ప‌టికే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో కొన‌సాగుతున్నారు. ఎన్నిక‌ల వేళ ఈ ప‌రిస్థితిలో కేసీఆర్ తో భేటీ అయితే త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌నే ఉద్దేశ్యంతో ఆయ‌న కేసీఆర్ తో భేటీని ప్ర‌స్తుతానికి ర‌ద్దు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News