కేసీఆరూ... ఆ 6ను వదలరా..?

Update: 2018-09-06 14:25 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జాతకాలు, జ్యోతిష్యాలు, సెంటిమెంట్లపై ఎంత నమ్మకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆయనకు 6 నెంబర్ చాలా లక్కీగా భావిస్తుంటారు. అందుకే ఇవాళ అసెంబ్లీ రద్దు చేయడానికి కూడా ఇవాళ 6వ తేదీ కావడమే కారణం. ఇక ఆయన అసెంబ్లీ రద్దు తర్వాత 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. అంటే న్యుమరాలజీ ప్రకారం 1, 5 కలిపితే వచ్చేది కేసీఆర్ అదృష్ట సంఖ్యం 6. మొత్తానికి కేసీఆర్ అన్నింటిలోనూ 6 ఉండేలా చూసుకుంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ 6 సెంటిమెంట్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో..?

Similar News