మోదీని కేసీఆర్ ఏం కోరారంటే…?

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలిశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ [more]

Update: 2018-12-26 11:40 GMT

ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలిశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 16 అంశాలను పరిష్కరించాల్సిందిగా ప్రధానిని కేసీఆర్ కోరారు. బైసన్ పోల్ గ్రౌండ్ ను రక్షణ శాఖ పరిధి నుంచి తప్పించి, తమకు అప్పగించాలని, అక్కడ సెక్రటేరియట్ నిర్మాణం చేపడతామని కోరారు. దీంతో పాటు వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, అదే జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు 450 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వెంటనే ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆర్థికసాయాన్ని ఇవ్వాలని కోరారు. దీంతోపాటు తాము ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రధానికి వివరించారు. వీరిద్దరి మధ్య ఫెడరల్ ఫ్రంట్ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News