బ్రేకింగ్ : స్పీకర్ దే తుది నిర్ణయం

కర్ణాటక శాసనసభలో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై తుదినిర్ణయం స్పీకర్ దేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈరోజు తమ రాజీనామాలు ఆమోదించాలంటూ అసంతృప్త ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో [more]

Update: 2019-07-16 07:16 GMT

కర్ణాటక శాసనసభలో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై తుదినిర్ణయం స్పీకర్ దేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈరోజు తమ రాజీనామాలు ఆమోదించాలంటూ అసంతృప్త ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అసంతృప్త ఎమ్మెల్యేల తరుపున ముకుల్ రోహత్గి వాదిస్తూ రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారన్నారు. రాజీనామాలు ఆమోదించడానికి స్పీకర్ కున్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. దీనికి చీఫ్ జస్టిస్ స్పందిస్తూ రాజీనామాలపై స్పీకర్ దే తుది నిర్ణయమన్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా స్పీకర్ చేతుల్లోనే ఉంటుందన్నారు. ఇందులో కోర్టు జోక్యం ఏమీ ఉండదని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News