కర్ణాటకలో వీరికే ఓటేయ్యాలన్న కేసీఆర్

Update: 2018-04-13 09:26 GMT

మాజీ ప్రధాని దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. దేవెగౌడ ఫెడరల ఫ్రంట్ కు ఆశీస్సులు అందజేశారన్నారు. వ్యవస్థలో మార్పు రావాల్సి ఉందన్న కేసీఆర్ దేశంలో జరిగే నీటి యుద్ధాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలే ఇందుకు బాద్యత వహించాలని ఆయన కోరారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు జేడీఎస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగానే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సినీనటుడు ప్రకాశ్ రాజ్ తనకు మంచి మిత్రుడన్న కేసీఆర్, కావేరీ జలాల వివాదాన్ని కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు పరిష్కరించలేకపోయాయన్నారు. దేశ ప్రయోజనాల కోసం ఎవరు కలసి వచ్చినా కలుపుకుపోతామన్నారు. రైతులు, సామాన్య ప్రజలకు అండగా ఉండేలా ఫ్రంట్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు.

Similar News