బాబును దెబ్బతీసేందుకేనా?

Update: 2018-12-21 04:09 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పై దూకుడు పెంచారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు బీజేపీయేతర కూటమి ఏర్పాటులో బిజీగా ఉన్నారు. అయితే కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. ఈ నెల 23వ తేదీన కేసీఆర్ ఒడిశా వెళ్లి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలవనున్నారు. ఆయనతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పై చర్చలు జరపనున్నారు. ఈనెల 24వ తేదీన ఢిల్లీ వెళ్లి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో సమావేశం కానున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేయాలని,అది ఎన్నికల తదనంతరం ఉండేలా చూడాలని కేసీఆర్ వారిని కోరనున్నారు. మరి కేసీఆర్ తో వారు కలసి వస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

Similar News