Telangana : ఎన్నికల కోడ్ అమలులోకి.. కేసీఆర్ టూర్ వాయిదా

ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కేసీఆర్ రేపటి వరంగల్ పర్యటన వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలగాణలోని అన్ని జిల్లాల్లో [more]

Update: 2021-11-09 11:45 GMT

ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కేసీఆర్ రేపటి వరంగల్ పర్యటన వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలగాణలోని అన్ని జిల్లాల్లో కోడ్ అమలులోకి వచ్చింది. హైదరాబాద్ జిల్లా మినహాయించి అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో కేసీఆర్ రేపటి తన వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

ప్లీనరీ కూడా….

అలాగే ఈ నెల 29 వతేదీన భారీ ఎత్తున టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో దీనిని కూడా వాయిదా వేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్లీనరీని ఏర్పాటు చేేశారు.

Tags:    

Similar News