జులైలో పుడితే కెప్టెన్ అవుతారా..?

Update: 2018-07-09 08:52 GMT

సోషల్ మీడియాలో తనదైన శైలిలో పోస్టులు చేస్తూ ఆకట్టుకునే టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. జులై 7వ తేదీన ఎంఎస్ ధోని పుట్టిన రోజు, జులై 8న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్వీట్ చేశారు. ‘జులై 7- ఎంఎస్ ధోనీ, జులై 8 - సౌరవ్ గంగూలీ, జూలై 9 - ?, జులై 10 - సునీల్ గవాస్కర్ లు జన్మించారు. మధ్యలో మిస్సైన జులై 9న పుట్టిన వారు భవిష్యత్ టీమిండియా కెప్టెన్ గా వస్తారు’ అని ట్వీట్ చేశారు. ‘జులై నెలలో పుట్టండి.. కెప్టెన్ అవ్వండి’ అని పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

Similar News