జయరాం కేసులో బయటకొస్తున్న సంచలన నిజాలు

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకాలం ప్రచారం జరిగినట్లుగా అసలు జయరాం నిందితుడు రాకేష్ రెడ్డి వద్ద [more]

Update: 2019-02-14 07:33 GMT

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకాలం ప్రచారం జరిగినట్లుగా అసలు జయరాం నిందితుడు రాకేష్ రెడ్డి వద్ద అప్పు తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో పాటు రాకేష్ రెడ్డికి పలువురు పోలీసు అధికారుల అండ ఉందనే పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు, తర్వాత రాకేష్ రెడ్డి 11 మంది పోలీస్ అధికారులతో టచ్ లో ఉన్నాడు. వీరిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు ఇన్స్ పెక్టర్లు ఉన్నారు. హత్య నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ ఇచ్చిన నల్లకుంట ఇన్స్ పెక్టర్, ఇబ్రహీంపట్నం ఏసీపీని ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. హత్యలో పోలీసు అధికారుల పాత్ర ఫై పోలీసులు విచారణ చేస్తున్నారు.

డబ్బుల కోసం ట్రాప్ చేసి

జయరాం హత్యకు ఏడుగురు వ్యక్తులు రాకేష్ రెడ్డికి సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జయరాం హత్యలో చింతల్ కు చెందిన రౌడీషీటర్ నగేష్ పాత్ర కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు. రౌడీషీటర్ నగేష్ తో కలిసే జయరాంను రాకేష్ రెడ్డి బెదిరించాడు. జయరాంను ఓ యువతితో ట్రాప్ చేసి బెదిరించి డబ్బు వసూలు చేయాలని వీరి భావించారు. ట్రాప్ చేయడంలో, జయరాంను కిడ్నాప్ చేయడంలో రౌడీషీటర్ పాత్ర ఉంది. డబ్బుల కోసం జయరాం చేత ఖాళీ బాండ్ పేపర్స్ ఫై సంతకాలు చేయించారు. జయరాం ఆస్తులు కొట్టేయాలని రాకేష్, నగేష్ ప్లాన్ చేశారు. కొన్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. భారీగా డబ్బులు వసూలు చేసేందుకు పక్కా స్కెచ్ వేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ స్కెచ్ కి తొమ్మిది మంది సహకరించారు. కాల్ డెటా ద్వారా వారి వివరాలు గుర్తించారు.

Tags:    

Similar News