యాత్ర సినిమాపై జ‌గ‌న్ స్పంద‌న‌

దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా తెర‌కెక్కిన యాత్ర సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటోంది. కాగా, [more]

Update: 2019-02-10 11:50 GMT

దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా తెర‌కెక్కిన యాత్ర సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటోంది. కాగా, యాత్ర సినిమాపై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ స్పందించారు. యాత్ర సినిమా విజ‌య‌వంతంగా విడుద‌ల చేసినందుకు ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌, నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి, శివ మేక‌, హీరో మమ్ముట్టితో పాటు చిత్ర బృందానికి ఆయ‌న ట్విట్ట‌ర్ లో అభినంద‌న‌లు తెలిపారు. వైఎస్సార్ ను ఎంతో నిబ‌ద్ధ‌త‌, ఆయ‌న స్వ‌భావాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించినందున ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Tags:    

Similar News