గాంధీలో ఫొటోలతో సహా ట్విట్టర్ లో?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కోసం గవర్నమెంట్ లు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కరోనా సోకిన పేషెంట్లకు అధునాతన రీతిలో వైద్య సహాయం అందిస్తుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో [more]

Update: 2020-04-09 01:26 GMT

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కోసం గవర్నమెంట్ లు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కరోనా సోకిన పేషెంట్లకు అధునాతన రీతిలో వైద్య సహాయం అందిస్తుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే ,కిందిస్థాయి అధికారులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అందుకు గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డు సంబంధించిన సంఘటన ఒక ఉదాహరణ. అక్కడ అత్యాధునిక పద్ధతుల్లో ముందుకు వెళ్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి . గాంధీ ఆసుపత్రి లో ని ఐసోలేషన్ వార్డులో ఉన్న పరిస్థితులను ఒక రోగి సెల్ఫీ వీడియో బయట పెట్టాడు. ఇప్పుడు వీడియో పైన ప్రభుత్వం వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఐసొలేషన్ వార్డులో…..

గాంధీ లోని ఏడో అంతస్థులో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఇందులో రోగులతో పాటు కరోనా రోగులను కూడా అక్కడే ఉంచారు. అయితే వార్డులో పరిస్థితులు పూర్తిగా దారుణంగా ఉన్నాయని, ఈ వసతుల మధ్య తమకు ఎలా నయం అవుతుందని ఒక వ్యక్తి ఈ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఐసోలేషన్ వార్డులో ఉన్న వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ వీడియో ను వెంటనే చూసిన మంత్రి ఈటల రాజేందర్ గాంధీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా కొన్ని గంటల్లోనే వార్డు మొత్తం పరిసరాలు పరిస్థితులు మారిపోవాలని ఆదేశించాడు. దీంతో గాంధీ ఆస్పత్రి సూపర్డెంట్ వెంటనే రంగంలోకి దిగారు. వార్డు ను పూర్తిగా చక్కబెట్టే ప్రయత్నం చేశారు. వార్డులో ఉన్న వసతులను పూర్తిగా గా మెరుగులు దిద్దారు.

చెత్తాచెదారంతో…..

ప్రధానంగా అక్కడ ఉన్న బాత్ రూమ్ ల తో పాటు శానిటేషన్ వర్క్ ని వెంటనే పూర్తి చేయించారు. వార్డులో ఉన్న చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించారు. ఈ ఫోటోలన్నీ మంత్రి ఈటల రాజేందర్ పంపించారు . రోగులకు అధునాతన వసతులు కల్పించాలని, వాళ్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఎన్ని చెప్పినప్పటికీ కిందిస్థాయి సిబ్బందిలో మార్పు రావడం లేదని దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతుంది. దీంతోపాటుగా కరోనా రోగుల చికిత్స కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ ప్రభుత్వ అధికారుల్లో మార్పులు రావడం లేదు. .

Tags:    

Similar News