అదంతా ట్రాష్

Update: 2018-06-23 13:39 GMT

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళతామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి రామచంద్ర కుంతియా స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ ను తొలగిస్తున్నామన్న వార్తల్లో నిజం లేదని చెప్పారాయన. ఢిల్లీలో వార్ రూమ్ లో సమావేశం ముగిసిన తర్వాత కుంతియా మీడియాతో మాట్లాడారు. అలాగే మీడియా ముందు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు కుంతియా. ఏదైనా సమస్యలుంటే అధిష్టానానికి నేరుగా చెప్పుకోవచ్చన్నారు. రాహుల్ గాంధీకి చెప్పినా అభ్యంతరం లేదని, అదే మీడియా ముందు మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దానం నాగేందర్ వంటి నేతలు పార్టీని వీడి వెళ్లిపోవడంపై కూడా ఆయన స్పందించారు. ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం లేదన్నారు. సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయన్నారు. నూతనంగా నియమించిన ముగ్గురు కార్యదర్శులకు ఒక్కొక్కరికి నలభై నియోజకవర్గాలు కేటాయించామని, వారే అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు కుంతియా.

Similar News