జగన్ వి తప్పుడు నిర్ణయాలు

వైఎస్ జగన్ మాట తప్పం..మడమ తిప్పమంటూనే అన్నీ అబద్ధాలు ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలోనూ మొత్తం 564 హామీలు జగన్ ఇచ్చారని, వాటిని [more]

Update: 2019-07-23 11:59 GMT

వైఎస్ జగన్ మాట తప్పం..మడమ తిప్పమంటూనే అన్నీ అబద్ధాలు ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలోనూ మొత్తం 564 హామీలు జగన్ ఇచ్చారని, వాటిని అమలు చేయాలని తాము కోరడం తప్పా? అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బీసీల బడ్జెట్ ను ఎందుకు తగ్గించారో చెప్పాలని నిలదీశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు దేవాదాయ శాఖలో ఎందుకు అమలుపర్చలేదని చంద్రబాబునాయుడు నిలదీశారు. ప్రధానమైన పోస్టులన్నింటినీ వీళ్లే పంచుకుని బీసీలకు చిన్నా చితకా పోస్టులకు ఇస్తున్నారన్నారు. తమను ప్రశ్నిస్తున్న నేతలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో బీసీల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. జగన్ ప్రవర్తన తప్పుడు విధానాలను అమలుపర్చే విధంగా ఉందన్నారు.

Tags:    

Similar News