విద్య, వైద్యరంగానికి కేటాయింపులు ఇవే

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి జిల్లా ఆసుపత్రికి ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి [more]

Update: 2020-02-01 06:51 GMT

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి జిల్లా ఆసుపత్రికి ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిరల్మా సీతారామన్ ప్రకటించారు. వైద్య రంగానికి 69 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్వచ‌్ఛ భారత్ కు 12,900 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇండ్రస్ట్రీ కామర్స్ కు 27,300 కోట్లు కేటాయించారు. త్వరలో చైన్నై -బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవేను ఏర్పాటు చేస్తున్నట్ల తెలిపారు. మరో ఐదు కొత్త స్మార్ట్ సిటీలు ప్రకటిస్తామన్నారు. నేషనల్ టెక్స్ టైల్ మిషన్ ను ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇన్ ఫ్రా రంగానికి వచ్చే ఐదేళ్లలో వంద లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 2023 నాటికి ఢిల్లీ – ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యారంగానికి 99,300 కోట్లు కేటాయించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తులకు ప్రత్యేక రాయితీలు ఉంటాయని చెప్పారు. ఎగుమతి ఉత్పత్తులపై ఈ ఏడాది నుంచి కొత్త పన్నులు వేస్తున్నట్లు చెప్పారు.

కొత్తగా వంద ఎయిర్ పోర్టులు…..

2024 కల్లా దేశంలో వంద కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్కిల్ డెవెలెప్ మెంట్ కు మూడు వేల కోట్లు కేటాయించారు. ఎగుమతి రుణాల పంపిణీకి నిర్విక్ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముంబై – అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ ట్రైన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అర్థగంగ స్కీమ్ కింద జల మార్గాలను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. జాతీయ గ్యాస్ గ్రిడ్ ను విస్తరించనున్నామన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్ కు 2.83 లక్షలు కేటాయిస్తున్నామని చెప్పారు. దేశ వ్యాప్తంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 9000 కిలోమీటర్ల మేర ఎకనమిక్ క్యారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో దేశమంతటా ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News