మరోసారి ఏపీ ప్రభుత్వంపై సీరియస్

మరోసారి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. వితంతు పింఛన్లను నిలిపివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పదిహేను రోజుల్లోగా పింఛన్లు ఇవ్వాలని ఆదేశించింది. 180 మంది బాధితులు తమకు [more]

Update: 2020-09-09 12:47 GMT

మరోసారి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. వితంతు పింఛన్లను నిలిపివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పదిహేను రోజుల్లోగా పింఛన్లు ఇవ్వాలని ఆదేశించింది. 180 మంది బాధితులు తమకు పింఛన్లను నిలిపివేశారంటూ హైకోర్టును ఆశ్రయించారు. వితంతు పింఛన్లు నిలిపివేశారని, రాజకీయ కక్షతోనే తమ పేర్లను తొలగించారని వారు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఏ మహిళ భర్త ఉండగా వితంతువునని చెప్పుకోదని, పదిహేను రోజుల్లోగా వితంతు పింఛన్లు మంజూరు చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News